రాయదుర్గం పట్టణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. సంజీవప్ప మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు సిపిఐ పూర్తి మద్దతు తెలిపింది. కార్మికులను బానిసల్లా మార్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, కనీస వేతనం ₹26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్, విత్తన సవరణ బిల్లులను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కనీస పెన్షన్ ₹9,000 కంటే తక్కువ కాకూడదని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను అంబానీలకు దాదాపుగా దత్తం చేస్తోందని, సామాన్య ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టిందని విమర్శించారు.