రాయదుర్గం: ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న దర్గాహొన్నూరు రోడ్డు

10చూసినవారు
రాయదుర్గం: ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న దర్గాహొన్నూరు రోడ్డు
బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ గ్రామ సమీపంలో దర్గాహన్నూరు గ్రామానికి వెళ్లే రోడ్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు మధ్య ఏర్పడిన లోతైన గుంతను అధికారులు పూడ్చకుండా వదిలేశారు. దీంతో స్థానికులు చెట్టు కొమ్మలు పెట్టి వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తుండటంతో, రాత్రివేళల్లో గుంత స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్