రాయదుర్గం: ఘనంగా ఆంజనేయస్వామి రథోత్సవం

5చూసినవారు
రాయదుర్గం: ఘనంగా ఆంజనేయస్వామి రథోత్సవం
రాయదుర్గం మండలంలోని చదం గ్రామంలో శుక్రవారం ఆంజనేయస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం రథాన్ని దేవాలయం నుంచి పాదగట్ట వరకు ఊరేగించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భీమిరెడ్డి, హనుమంతరెడ్డి, ఈరన్న, కృష్ణమోహన్రెడ్డి, రామచంద్రారెడ్డి, సంజీవరెడ్డి, డీలర్ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you