కణేకల్లు స్థానిక వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో జేజేఎల్ 384 అనే నూతన వరి వంగడం సాగు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రవి తెలిపారు. బుధవారం ఆయన ఈ వరి పంటను పరిశీలించారు. ఈ వంగడం 125 రోజుల్లోనే పంటకు వస్తుందని, రోగాలను తట్టుకుంటుందని, దీనికి అధిక డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.