రాయదుర్గం: కమనీయం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

16చూసినవారు
రాయదుర్గం: కమనీయం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కల్యాణం శనివారం కమనీయంగా జరిగింది. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తిస్వామీజీ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యస్వామి, వేదపండితులు హరిప్రసాద్భరద్వాజ్ ల పర్యవేక్షణలో స్వామివారికి నిత్యారాధనలు, పుష్పాలంకరణ, నైవేద్యపూజలు నిర్వహించారు. మహామంగళహారతి అనంతరం శ్రీవారి కల్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా సాగింది. అనంతరం ఆరు పేద జంటలకు ఉచిత వివాహాలు నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్