అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాయదుర్గం స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు పతకాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ చదువుతున్న లీలావతి, ఆసియాభాను, సుప్రియ పదిరోజుల పాటు అమరావతిలో జరిగిన లోకల్ రిపబ్లిక్ డే క్యాంపులో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం వారిని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.