రాయదుర్గం: ఘనంగా ఎంపీపీ ప్రమాణ స్వీకారం

7చూసినవారు
రాయదుర్గం: ఘనంగా ఎంపీపీ ప్రమాణ స్వీకారం
బొమ్మనహళ్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ముల్లంగి నాగమణి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 5న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో నాగమణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, భూగర్భజలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంగాధర ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్