రాయదుర్గం: ఏళ్ల సమస్య పరిష్కరించిన అధికారులు

11చూసినవారు
రాయదుర్గం: ఏళ్ల సమస్య పరిష్కరించిన అధికారులు
బొమ్మనహాళ్ మండలంలోని దర్గాహొన్నూరు గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న దారి సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కేశప్ప పరిష్కరించారు. మంగళవారం రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ మునివేలు, ఎస్ఐ నబీరసూల్, వీఆర్వో రామన్న గ్రామాన్ని సందర్శించి, గ్రామకంఠంలో ఉన్న దారిలో గుడిసెలు వేసుకున్నవారికి వాటిని తొలగించుకోవాలని సూచించారు. దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, పీర్లు ఊరేగింపు సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయాయి. గుడిసెలు తొలగించడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్