రాయదుర్గం: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే మా లక్ష్యం

14చూసినవారు
రాయదుర్గం: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే మా లక్ష్యం
గురువారం రాయదుర్గం మండలంలోని పల్లేపల్లి విద్యుత్తు సబ్ స్టేషన్ లో ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన అదనపు ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన విప్ కాలవ శ్రీనివాసులు, పొలాలకు అంతరాలు లేకుండా, లో ఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇకపై వ్యవసాయానికి, ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం పూటే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఆగిపోయిన సుమారు రూ. 60 కోట్ల విలువైన ఆర్డీఎస్ఎస్ పనులను పునః ప్రారంభించి, ఇప్పటికే 40 శాతం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్