శనివారం సందర్భంగా డీ. హీరేహాళ్ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయంలో, బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. మురడి ఆలయంలో అర్చకులు రామాంజనేయులు, పవన్ స్వామి ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, కుంకుమార్చన, బిల్వార్చన, సహస్రనామార్చన, అభిషేకాలు జరిగాయి. నేమకల్లులో ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆచార్యులు పూజలు నిర్వహించగా, సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిర్మల్యవిసర్జన, అష్టోత్తర, పుష్పాలంకరణ, మహామంగళారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.