బొమ్మనహాళ్ స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ పయ్యావుల హనుమంతప్ప అలియాస్ బాస్ గురువారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఆయన మృతదేహానికి పలువురు నివాళులర్పించారు.