రాయదుర్గం: వైభవంగా రాజులదేవుడి ఉత్సవాలు

1చూసినవారు
రాయదుర్గం: వైభవంగా రాజులదేవుడి ఉత్సవాలు
గుమ్మఘట్ట మండలంలోని అడిగుప్ప అటవీప్రాంతంలో వెలసిన రాజులదేవుని ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి రాజులదేవుని ప్రతిమను వేదావతి నదికి తీసుకువెళ్లి గంగపూజ నిర్వహించారు. అనంతరం మంగళవారం అటవీప్రాంతంలోని దేవాలయంలో ప్రతిమను ఉంచారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్