బొమ్మనహళ్ మండలం శ్రీధరఘట్ట గ్రామ శివారులోని శ్రీ కామలపురం ఆంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. మూలవిరాట్ ను ఆరు బయటే ఉంచారు. ఆలయ నిర్మాణ పనులు 75 శాతం పూర్తయినా, ఆ తర్వాత నిలిచిపోయాయి. కాలక్రమేణా నిర్మించిన స్తంభాలు, ప్రహారీ, పైకప్పు పగుళ్లు వచ్చి, నూతన ఆలయం కూడా శిథిలమైంది. శుక్రవారం భక్తులు ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.