తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన నీరు శనివారం రాత్రి 9గంటలకు 104-500వ కిలోమీటరు వద్ద ఆంధ్రా సరి హద్దులోని బొమ్మనహాళ్ కు చేరాయి. కాలువకు మరమ్మతులు జరుగుతుండడంతో ఆంధ్రా వాటా నీటి విడుదలకు ఇండెంట్ ఇవ్వలేదు. తుంగభద్ర ప్రధాన కాలువకు 137వ కిలోమీటరు వద్ద యూటీ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఎగువన ఆంధ్రా సరి హద్దులోని గేట్లను దింపి నీటిని సరి హద్దులోనే నిలిపినట్లు ఎస్ఈ నారా యణనాయక్ తెలిపారు.