రాయదుర్గం మండలంలోని ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు శిరిగేదొడ్డి తిప్పేస్వామి (36) అప్పుల బాధతో మంగళవారం మృతిచెందాడు. ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు కోసం అప్పులు చేసిన తిప్పేస్వామి, సొంత పొలం, కౌలు తోటల్లో దిగుబడులు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సుమారు రూ.8 లక్షల మేర అప్పులు ఉన్నాయని తెలిసింది. వారం రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిప్పేస్వామికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.