రాయదుర్గం పట్టణంలోని ఆటో డ్రైవర్లకు గురువారం స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో ఉచిత వైద్యశిబిరం, కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయదుర్గం సీఐ జయనాయక్ సుమారు 100 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ యూనిఫాంలను పంపిణీ చేసి, రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మండల కన్వీనర్ కురుబ హనుమంతు పాల్గొన్నారు.