జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు మొదటిసారి రాయదుర్గానికి శుక్రవారం రావడంతో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆయన ముందుగా పట్టణంలోని దశభుజగణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాళు పురుషోత్తం, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి నాగరాజు, జిల్లా కార్యదర్శి కురుబ ప్రశాంతి, జిల్లా టీడీపీ కోశాధికారి మహబూబ్ బాష పాల్గొన్నారు.