రాయదుర్గం: కణేకల్లులో ప్రజాదర్బార్ నిర్వహించిన విప్ కాలవ

4చూసినవారు
రాయదుర్గం: కణేకల్లులో ప్రజాదర్బార్ నిర్వహించిన విప్ కాలవ
కణేకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై నిరుపయోగంగా ఉన్న 40 సైకిళ్లను విప్ శుక్రవారం విద్యార్థినులకు పంపిణీ చేశారు. అనాథ పిల్లల చదువులకు పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్