రాయదుర్గం: యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

77చూసినవారు
రాయదుర్గం: యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య
పొలంపనులకు వెళ్లడానికి ఇష్టంలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన డి. హిరేహాల్ మండలం కళ్యం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కళ్యం గ్రామానికి చెందిన సంజీవప్ప, నింగమ్మల కుమారుడు అజయ్ ఇంటర్ మధ్యలో వదిలేసి ఇంటిలోనే ఉన్నాడు. పొలం పనులకు రమ్మని తల్లిదండ్రులు చెప్పగా, మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్