రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

9చూసినవారు
రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
రాయదుర్గం పట్టణంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోతిగుట్ట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కదరంపల్లి గ్రామానికి చెందిన మారుతి (20) వ్యక్తిగత పనుల కోసం ద్విచక్ర వాహనంపై రాయదుర్గానికి వచ్చాడు. పనులు పూర్తిచేసుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు ప్రయాణంలో రవాణా శాఖ కార్యాలయం దగ్గర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్