ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసిన గత పాలన నుంచి పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పాలనకు రాష్ట్రం మారిందని అన్నారు. శనివారం బొమ్మనహాల్ మండలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛనుదారులు సీఎం చంద్రబాబును తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారని, ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు.