బెలుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ వద్ద ఆదివారం తహశీల్దార్ అనిల్ కుమార్ ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. శనివారం ఈతకు వెళ్లి విజయ్ అనే బాలుడు మృతి చెందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ వద్దకు ఎవరూ వెళ్లకుండా, నీటిలోకి దిగకుండా నిషేధిస్తూ బోర్డులు పెట్టించారు.