Feb 19, 2026, 02:02 IST/
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన!
Feb 19, 2026, 02:02 IST
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22న ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో, 23, 24న హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యపేట, భద్రాచలంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. 20-40 మి.మీ. వర్షపాతం ఉండొచ్చని అంచనా వేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచికొట్టే ఛాన్స్ ఉందని పేర్కొంది.