
గార్లదిన్నె వాసవి అమ్మ వారికి పంచలోహ కవచం
గార్లదిన్నె మండల కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీమత్ వాసవి కన్యాకాపరమేశ్వరీ అమ్మవారికి అదే గ్రామానికి చెందిన ఆలయ కార్యదర్శి పిన్ని సత్య నారాయణ నూతన పంచలోహ కవచాన్ని తయారు చేయించి సమర్పించారు. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు, అర్చనలు నిర్వహించి, అలంకరణ చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షులు సురేష్ తెలిపారు.



































