కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. రెండు బైకులు ఢీకొనడంతో యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన కప్పల గంగాధర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది