విజయవాడలోని గన్నవరం కేసరపల్లిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి యశ్వంత్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లా నార్పల మండలం జంగమరెడ్డిపల్లికి చెందిన యశ్వంత్ కుమార్ రాత్రి ఉరేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ కుమారుడిని హత్య చేశారని, న్యాయం చేయాల్సిన పోలీసులు యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపించారు.