సింగనమల తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అఖిలపక్ష సమావేశం

1175చూసినవారు
సింగనమల తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల అఖిలపక్ష సమావేశం
సింగనమల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శేషారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ శేషారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ సచివాలయం వద్ద బీఎల్ఓను సంప్రదించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారికి ఇది సులభతరం అవుతుందని తెలిపారు. అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి జనసేన నాయకులు తోట ఓబిలేసు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్