జెడ్పి హైస్కూలును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

5చూసినవారు
జెడ్పి హైస్కూలును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పుట్లూరు మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూలును ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి, మరింత మెరుగైన నాణ్యతతో ఆహారాన్ని అందించాలని సూచించారు. కోడిగుడ్ల సైజు పెద్దవిగా సరఫరా చేయాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి ఆర్.ఓ. మరమ్మతులు, బస్సుల సకాలంలో రాకపోవడం, గ్రౌండ్ కు ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్