కోడి పందాలు పేకాట ఆడితే చర్యలు తప్పవని నార్పల ఎస్సై సాగర్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నార్పల మండలంలో ప్రజలు ఎక్కడైనా కోడిపందాలు గాని, పేకాట గాని ఆడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండగ రోజులలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.