అన్నమయ్య జిల్లాలోని లోలూరు గ్రామంలోని పాఠశాలలో ఆదివారం 5వ జాతీయ సౌత్ జోన్ సబ్ జూనియర్ బాల, బాలికల షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జీ. చంద్రశేఖర్ పోటీలను ప్రారంభించి, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. రాష్ట్రంలో క్రీడా కోటా అమలు ద్వారా వందలాది మంది క్రీడాకారులకు మేలు జరుగుతోందని ఆయన తెలిపారు.