లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి: కలెక్టర్

10చూసినవారు
లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి: కలెక్టర్
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రేకలకుంట గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును లబ్ధిదారుల ఇళ్ల వద్దే సిబ్బంది పంపిణీ చేయాలని, ఒకటో తేదీన తీసుకోని వారికి మంగళవారం పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడి, పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర మూర్తి, ఎంపీడీఓ సాల్మన్, ఎంపీపీ సునీత కూడా పాల్గొన్నారు.