ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన చౌకబారుతనానికి నిదర్శనమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రాంబాబు దిష్టిబొమ్మను చీపురులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబటి మాటలు బూతు రాజకీయాలకు పరాకాష్ట అని, సభ్యసమాజం సిగ్గుపడే విధంగా సీఎంపై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. చేసిన తప్పులకు సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.