రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తామని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో దివంగత శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో రూ. 6కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని మాజీమంత్రి రఘువీరారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ ఆసుపత్రిని మూడో తేదీ ప్రారంభిస్తామని, ఆంధ్ర, తెలంగాణ, ఒడిసా రాష్ట్రాల్లో 24 ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.