శింగనమల: శేషుడిపై శేషశైలవాసుడు ఊరేగింపు

3చూసినవారు
శింగనమల: శేషుడిపై శేషశైలవాసుడు ఊరేగింపు
బుక్కరాయసముద్రం మండలం దేవరకొండపై వెలసిన శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీ కొండమీదరాయుడు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం స్వామివారు శేషవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. మంగళవాయిద్యాల నడుమ స్వామి ఊరేగింపు శోభాయమానంగా సాగింది. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్