శింగనమల: సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

8చూసినవారు
శింగనమల: సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మంగళవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 12 మంది బాధితులకు రూ. 14,15,466 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదల కుటుంబాలను ఆదుకోవడంలో సీఎం సహాయ నిధి ఒక వరంలా పనిచేస్తుందని తెలిపారు. అర్హులైన పేదలు ఈ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్