శింగనమల: అంతిమ యాత్రకు అవస్థలు

8చూసినవారు
అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని తరిమెల గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన దారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మసీదు సమీపంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారిలో వంక ఉండటంతో, అందులో నిత్యం నీరు నిలిచి ఉంటుంది. మృతదేహాలను ఖననం కోసం తీసుకెళ్లాలంటే నడుములోతు నీటిలోంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించి, శ్మశానానికి రోడ్డు వేయాలని ఆదివారం గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి జన్మించిన ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్