శింగనమల మండలంలోని చిలేపల్లి కూతలేరు వంక ప్రాంతంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఎక్సక్ వేటర్తో ఇసుకను తోడి టిప్పర్లలో లోడింగ్ చేస్తున్న అక్రమార్కులను కొందరు స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హడావుడిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు, ఎక్సక్ వేటర్ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అధికారులు ఎలాంటి ఇసుక తరలింపు జరగలేదని నిర్ధారించి వెనుదిరిగారు. ఈ సంఘటన పట్టపగలే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని తెలియజేస్తోంది.