శింగనమల: కొండమీదరాయుడికి వెండి ఆభరణాల సమర్పణ

0చూసినవారు
శింగనమల: కొండమీదరాయుడికి వెండి ఆభరణాల సమర్పణ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దేవరకొండపై వెలసిన కొండమీద రాయుడు స్వామికి ఎఫ్సీఐ గోడౌన్ డిప్యూటీ మేనేజర్ బీఎన్ రవి అనే భక్తుడు గురువారం రూ. 4.5 లక్షల విలువైన వెండి కిరీటం, శంఖుచక్రాలు, హస్తాలు, పాదాలను సమర్పించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రవి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, ఆభరణాలను ఆలయ కమిటీకి అందజేశారు. అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారాయణస్వామి, ఈఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్