శింగనమల: పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే

0చూసినవారు
శింగనమల: పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే
విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు క్రీడలు దోహదపడతాయని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద ఏపీఎస్పీ 14వ బెటాలియన్ వార్షికోత్సవం స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్