శింగనమల: బకాయిలు చెల్లించేలా చూడాలని ఎమ్మెల్యేకి వినతి

12చూసినవారు
శింగనమల: బకాయిలు చెల్లించేలా చూడాలని ఎమ్మెల్యేకి వినతి
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వారు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని అనంతపురం క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 11వ తేది నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు రావాల్సిన రూ. 35 కోట్ల బకాయిలపై చర్చించాలన్నారు. ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించేలని విజ్జప్తి చేశారు.

సంబంధిత పోస్ట్