అనంతపురం బీసీ కార్పొరేషన్ నూతన ఈడీగా సుబ్రహ్మణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎఫ్ఎసీ ఈడీగా పనిచేసిన రామసుబ్బారెడ్డి నుంచి ఆయన ఈ బాధ్యతలను అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది సుబ్రహ్మణ్యంకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.