నూతన సంవత్సర వేడుకల్లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: 8 మందికి గాయాలు

2చూసినవారు
ఎల్లనూరులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కట్టెలు, రాళ్లతో జరిగిన ఈ దాడుల్లో 8 మంది గాయపడ్డారు. బాధితులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడులకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్