పుట్లూరు మండలంలో రాంబాబు అనే రైతుకు చెందిన 2.5 ఎకరాల అరటి తోట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అరటి చెట్లు, డ్రిప్ పరికరాలు పూర్తిగా కాలిపోయి, సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు రాంబాబు కోరారు.