శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైయస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో ప్రతాప్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిపై మళ్లీ దాడి జరగడంతో, గాయాలతోనే ప్రతాప్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.