తాడిపత్రిలో 10 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

4చూసినవారు
తాడిపత్రిలో 10 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
తాడిపత్రి మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సజ్జలదిన్నె గ్రామ సమీపంలో తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,60,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్