అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, తాడిపత్రి ఏఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, రూరల్ యు. పి. ఎస్ సి. ఐ శివగంగాధర్ రెడ్డిల ఆధ్వర్యంలో టెక్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మహిళలపై జరుగుతున్న గృహహింస, వేధింపులు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు వంటి నేరాలపై వివరించారు. శక్తి టీమ్ సేవలు, హెల్ప్ లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్లలో అందించే సేవల గురించి కూడా తెలియజేశారు.