తాడిపత్రిలో రేపటి నుంచి ఆయాన్ తైక్వాండో సమ్మర్ క్యాంప్

4420చూసినవారు
తాడిపత్రిలో రేపటి నుంచి ఆయాన్ తైక్వాండో సమ్మర్ క్యాంప్
తాడిపత్రిలో పిల్లలు, యువతలో శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్యాంప్‌లో తైక్వాండో బేసిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్, ఆత్మరక్షణ, నంచాక్, స్టిక్ వెపన్ ట్రైనింగ్, వెయిట్ లాస్, ఫిట్‌నెస్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, ఫోకస్ బిల్డింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అకాడమీ నిర్వాహకులు మరిన్ని ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఈ శిక్షణలో లేడీ కోచ్‌లు కూడా ఉంటారు.

సంబంధిత పోస్ట్