ఎల్లనూరులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన మొత్తం 36 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సై రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, ఇరు పార్టీల నాయకుల ఫిర్యాదుల మేరకు టీడీపీ నుంచి 23 మంది, వైసీపీ నుంచి 13 మందిపై భారత శిక్షాస్మృతిలోని 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.