నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎల్లనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.