కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడిపత్రికి చెందిన డ్రైవర్ వెంకటరమణ మృతి చెందారు. జయనగర్ కాలనీ నుంచి గండికోట విహారయాత్రకు వెళ్తుండగా, టోల్ ప్లాజా వద్ద టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.